![]() |
![]() |
.webp)
ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ ఐన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో మరో పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలం క్రితం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి ఓన్ బిజినెస్ చేసుకోవడం స్టార్ట్ చేసాడు. కర్రీ పాయింట్ పెట్టిన వెంటనే దానికి వచ్చిన రెస్పాన్స్ చూసే అతనే నోరెళ్లబెట్టాడు. జనాల తాకిడికి కాస్త బ్రేక్ ఇస్తూ షాప్ ని కొన్ని రోజుల పాటు మూసేసాడు.
ఐతే షాప్ పెట్టిన వెంటనే క్లోజ్ చేసేసరికి అంతా ఐపోయిందని అనుకున్నారు కానీ ఆ రూమర్స్ మీద ఆర్పీ క్లారిటీ ఇచ్చాడు. వస్తున్న జనానికి తగ్గట్టు సరిగా సప్లై చేయలేకపోతున్నామని ఇంకా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు. అలా నెల్లూరు వెళ్లి అక్కడ సూపర్ గా చేపల పులుసు వండే ఆడవాళ్లను వెదకడం స్టార్ట్ చేసాడు. దానికి ఆడిషన్స్ కూడా పెట్టాడు. అందులో కొంతమందిని ఎంపిక చేసినట్లు చెప్పాడు. వాళ్ళను హైదరాబాద్ కి తీసుకెళ్లి అక్కడ సకల సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు.
ఇంక నెల్లూరు చేపల పులుసు షాప్ ప్రారంభించి నెల రోజులు అయిన సందర్భంగా కిరాక్ ఆర్పీ మళ్ళీ షాప్ ఓపెన్ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. షాప్ తిరిగి ఓపెన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. పండుగ సందర్భంగా మాత్రం తమ కర్రీ పాయింట్ క్లోజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సంక్రాంతి తర్వాతి నుంచి రోజూ నెల్లూరు చేపల పులుసు అందిస్తామని చెప్పుకొచ్చాడు. కొత్త స్టాఫ్ ని పనిలోకి తీసుకున్నట్లు దానికి సంబంధించిన సప్లై కూడా పెంచనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. తనకు నచ్చిన పని వదిలి ఎక్కడకీ వెళ్ళేది లేడు అన్నాడు.
![]() |
![]() |